Bus Bhavan | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని దివ్యాంగులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడేండ్లు కావొస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. న్యాయబద్దమైన హక్కుల కోసం నిరసన తెలుపుతున్న దివ్యాంగులను పోలీసులు అడ్డుకున్నారు.
బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ధర్నా
నిరసన తెలుపుతున్న వికలాంగులను అడ్డుకున్న పోలీసులు https://t.co/3pBjtdydKF
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026