ఉస్మానియా యూనివర్సిటీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్టియ్రల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) – అడ్వాన్స్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( ఏఎంపీఆర్ఐ) డైరెక్టర్ గా ప్రొఫెసర్ తల్లాడ భాస్కర్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మేడ్చల్, ఏప్రిల్24(నమస్తే తెలంగాణ): ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ సభకు తరలివచ్చేందుకు ప్రజలు ముందుకు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రజతోత్సవ సభకు తరలించేలా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ‘బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు.
మేడ్చల్ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో రజతోత్సవ సభకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం’. అని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ‘కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని రజతోత్సవ సభకు తరలివస్తామని చెబుతున్నారు’ అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు.