అయ్యో పాపం.. అవ్వ..!

15 రోజులుగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అవస్థలు
కరోనా అనుమానంతో చేరదీయని దుస్థితి
పోలీసులకు, అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనం
కనికరించని మానవత్వం
కుత్బుల్లాపూర్, ఆగస్టు 2: మానవత్వం మరిచిపోయేలా ఉన్నారు.. మనిషి మరణిస్తున్నా.. జనం అటువైపు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. అందుకు అద్దం పట్టేలా ఉంది ఈ వృద్ధిరాలి ఘటన. రోడ్డు పక్కనే కదలలేనిస్థితిలో ఓ 80 (సుమారు) ఏండ్ల వృద్ధురాలు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. నోటి నుంచి మాట రావడం లేదు. పలుకరించినా కండ్లతో చూడడం తప్ప నోటితో చెప్పలేని దుస్థితి. 15 రోజుల కిందట కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయ సమీపంలోకి ఓ వృద్ధురాలు చేరింది. ఎక్కడ నుంచి వచ్చిందో.. ఏ ప్రాంతమో తెలియని అవ్వను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లడంతో కుడికాలు విరిగింది. దీంతో రోడ్డు పక్కనే పడిపోయి కదల్లేనిస్థితిలో ఉంది. అందరూ వస్తున్నారు.. పోతున్నారు తప్ప ఎవరూ అయ్యో పాపం అన్న సందర్భం లేదు. కరోనా సోకిందనే అనుమానమూ అవ్వ దగ్గరకు రాకుండా చేసింది. విగతజీవిలా పడి ఉన్న ఆ వృద్ధురాలికి పక్కనే ఉన్న పూలమొక్కల వ్యాపారి సూరిబాబు, కొబ్బరి బోండాలు అమ్మే ఫణికుమారి కనికరించి వర్షానికి తడవకుండా.. అవ్వకు ఓ పరదా సాయంతో నీడనిచ్చారు. రోజూ బిస్కెట్, ఛాయ్ తప్ప అన్నం ఇతర పదార్థాలు తినడం లేదని పక్కనే ఉన్నవారు చెబుతున్నారు. ఆమె ఆచూకీ కోసం ఆరాతీసినా నోటి నుంచి మాట మెదపడంలేదని పేర్కొన్నారు.
పట్టించుకోని పోలీసులు, అధికారులు..
15 రోజుల నుంచి రోడ్డు పక్కన పడి ఉన్న ఆ అవ్వను చేరదీయాలనే ఆలోచనతో స్థానికులు కొంతమంది పోలీసులకు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎవరూ అటు వైపునకు కన్నెత్తి కూడా చూడడంలేదని స్థానికులు చెబుతున్నారు.
తాజావార్తలు
- ఏపీలో కొత్తగా 115 కరోనా కేసులు
- గొలుసుకట్టు మోసం.. 24 మంది అరెస్టు
- ట్విట్టర్లో మహిళలు ఏం పోస్ట్ చేస్తున్నారంటే..?
- పులితో పరాచాకాలు ఆడుతున్న విజయ్ హీరోయిన్
- కోతులకు కల్లు ప్యాకెట్ దొరికితే ఊరుకుంటాయా.. ఓ పట్టుపట్టేశాయ్: వీడియో
- ఒక్కరోజే 15 లక్షల మందికి టీకాలు
- తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
- కొవిడ్ టీకా తీసుకున్న హేమమాలిని
- టెస్ట్ చాంపియషిప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
- ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు