పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన జీవోతో మూడేండ్లు వృథా అవుతుందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తే అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్వీ నగర శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించి హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జితేందర్‌కు వినతిపత్రం అందజేశారు.
సుల్తాన్‌బజార్, ఆగస్టు 21: పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగంలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ నగర నాయకులు విశాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్వీ నగర శాఖ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహించి హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జితేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులు, బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.
పోచారం, ఆగస్టు 21:పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 97 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోచారం పరిధిలోని నారపల్లిలో పాలిటెక్నిక్ విద్యార్థులు శుక్రవారం ఆందోళనకు దిగారు. సిద్దార్ధ ఇంజినీరింగ్ కళాశాలలోని పాలిటెక్నిక్ విద్యార్థులు వరంగల్ ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ డిప్లామా కోర్సులను యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన 97 జీవోతో విద్యార్థులకు అన్యాయం జరుగనుందని మండిపడ్డారు. వెంటనే 97 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రామంతాపూర్, ఆగస్టు 21: రామంతాపూర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద మెయిన్ రోడ్డుపై విద్యార్థులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. సిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి సీమ్‌తో మూడేండ్లు వృథా అవుతుందని, వెంటనే జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థులు, ఏబీవీపీ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. రామంతాపూర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.