రేపు పాతబస్తీలో భద్రత మరింత కట్టుదిట్టం
హైదరాబాద్ : శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హైదరాబాద్ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఓ వర్గం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు నేపథ్యంలో ఎలాంటి అలర్లు సంభవించకుండా పాతబస్తీలో పోలీసులు భారీగా మోహరించారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల కోసం ముస్లింలందరూ బయటకు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ సమయంలో అలర్ట్గా ఉండాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఓల్డ్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న మసీదుల వద్ద పోలీసులను మోహరించాలని సూచించారు. చార్మినార్, మక్కామసీదు ఏరియాల్లో దాదాపు 5 వేల మంది ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. తమ నివాసాలకు దగ్గర్లో ఉన్న మసీదుల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని, అనవసరంగా బయటకు రావొద్దని ముస్లిం మత పెద్దలు విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు, ధర్నాలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

