Old City | నివురుగప్పిన నిప్పులా పాతనగరం.. భారీగా పోలీసులు మోహరింపు
Old City | వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
Old City | చార్మినార్, ఏప్రిల్ 4 : వక్ఫ్ బిల్లును పార్లమెంట్లో అమోదించడంతో ముస్లిం వర్గాల్లో భిన్నాభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదించి రాష్ట్రపతి భవన్‌కు చేరిన పక్షంలో ఇక రాజ్యాంగబద్దంగా అమలు కావడమే తరువాయి. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మెజారిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేసి బిల్లు సవరణకు మద్దతు పలికారు. ఈ క్రమంలో ముస్లింలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్వాగతిస్తే.. మరికొందరు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఈ క్రమంలో పాతనగరంలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పుల కొనసాగుతుంది. శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల నేపథ్యంలో సున్నిత, అతి సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన చోట్ల పోలీస్ ఉన్నతధికారులు పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది అంతర్గతంగా అందించిన నివేదికల ప్రకారం చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు, ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు వాహనాలను, సిబ్బందిని సిద్ధం చేశారు. నగర్ జాయింట్ సీపీ విక్రమ్ సింగ్ మాన్తోపాటు దక్షిణ మండల డీసీపీ స్నేహ మెహ్రా, అదనపు డీసీపీ జావీద్‌లు బందోబస్తును పర్యవేక్షించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

