Hyderabad | హైదరాబాద్‌లో నెల రోజులు ఆంక్షలు.. ర్యాలీలు, ధర్నాలు నిషేధం: సీవీ ఆనంద్
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) అట్టుడుకుతున్నది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు.
హైదరాబాద్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో రాజధాని హైదరాబాద్ (Hyderabad) అట్టుడుకుతున్నది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నెలరోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమవారం నుంచి నవంబర్ 28 వరకు సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేదం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
కాగా, ఏక్పోలీస్ విధానం అమలు, సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళన ఉధృతమైంది. యూనిఫాంలతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు హైదరాబాద్‌లో ఆంక్షలు విధించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

