ఎల్బీనగర్, ఏప్రిల్ 15: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్‌పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి.. 16 మంది యువతులు, డీజే ఆపరేటర్‌ను అదుపులోకి తీసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. సీఐ వెంకటేశ్వర్ రావు వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా వైల్డ్ హారట్స్ పబ్ నిర్వహిస్తున్నారు.
అయితే.. పబ్ లోపలికి ఎంట్రీ ఫ్రీ గా యిచ్చి..యువతులను ఎరవేసి ఒక్కొక్కరి నుంచి వేలాది రూ పాయలు వసూలు చేస్తున్నారు. పబ్ యజమాని రాము.. పబ్ కు వచ్చిన యువకుల వద్దకు అమ్మాయిలను పంపి, వారితో డ్యా న్స్‌లు చేయిస్తూ, మద్యం తాగేలా చేసి అధిక బిల్లులు వసూలు చేస్తున్నాడు.
యువతులతో అశ్లీల నృత్యాలు చేపిస్తున్నట్లు తేలింది. దీంతో సోమవారం అర్ధరాత్రి పోలీసులు సదరు పబ్‌పై దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా నృత్యాలు చేస్తున్న 16 మంది యువతులను, ఓ డిజే అపరేటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పబ్ యజమా ని రాము, మేనేజర్ సంతోష్‌లు పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.