హైదరాబాద్: సికింద్రాబాద్ చిలకలగూడలో అర్ధరాత్రి కాల్పులు (Firing) కలకలం సృష్టించాయి. శుక్రవారం అర్ధరాత్రి చిలకలగూడలో సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులను చూసిన ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిపై ఓ కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. అనంతరం ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కాగా, తోపులాటలో మిస్ఫైర్ అయిందని చిలకలగూడ సీఐ వెల్లడించారు.