ఘనంగా కోలేటి జన్మదిన వేడుకలు
ఖైరతాబాద్, జూన్ 5: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ నిండు నూరేండ్లు వర్ధిల్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని వాసవి సేవా కేంద్రంలో కోలేటి దామోదర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎల్ రమణ, తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలుగా అవకాశం కల్పించారని చెప్పారు.
ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్యభవన్ కోసం స్థలం, నిధులు కేటాయించారని అన్నారు. కోలేటి దామోదర్ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకొన్న తర్వాత రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ల ఆధునీకరణకు పాటుపడ్డారని తెలిపారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్నదని, అందుకు కోలేటి దామోదర్ విశేష కృషి చేశారని అన్నారు. దామోదర్ మాట్లాడుతూ తనకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మొదలుకొని గవర్నర్ రోశయ్య వరకు చాలామంది పెద్దలతో పరిచయం ఏర్పడిందని, సీఎం కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ పదవి అప్పజెప్పారని వెల్లడించారు. కార్యక్రమంలో వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు ఆలంపల్లి రవి కుమార్, కొండ్లె మల్లికార్జున్, వెంపటి మధు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

