మానవ మనుగడలో మొక్కలే కీలకం : అదనపు డీజీపీ అభిలాష బిస్త్
మానవ మనుగడలో మొక్కలే కీలకం | స్వచ్ఛమైన గాలినందించే నేటి మొక్కలే ఆరోగ్యాన్ని పంచే రేపటి చెట్లుగా మానవాళి మనుగడలో ప్రధాన భూమిక పోషిస్తాయని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డీజీపీ అభిలాష బిస్త్ పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్,ఆగస్టు10 : స్వచ్ఛమైన గాలినందించే నేటి మొక్కలే ఆరోగ్యాన్ని పంచే రేపటి చెట్లుగా మానవాళి మనుగడలో ప్రధాన భూమిక పోషిస్తాయని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డీజీపీ అభిలాష బిస్త్ పేర్కొన్నారు. మంగళవారం యూసుఫ్‌గూడ ప్రథమ పటాలంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజిపి డాక్టర్ జితేందర్, నగర పోలీసు సంయుక్త కమిషనర్ అవినాష్ మహంతిలతో కలిసి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు ఆరోగ్య ప్రదాయినిగానే కాక అనారోగ్యాలను దూరం చేసే సంజీవనిగా కూడా ఉపయోగపడుతాయన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి వాటిని సంరక్షించడం ద్వారా ఆరోగ్యకర సమాజానికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అధికారులు డీఐజీ ఎంఎస్ సిద్దిఖీ, ఓఎస్డీ పి.సత్యనారాయణ, సీఏఓ శ్రీరామ్, ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ అనూప్ కుమార్ మిశ్రా, అదనపు కమాండెంట్ కె.వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్స్ జి.రాజు, కె.సంపత్ కుమార్ రెడ్డి, జె.రాందాస్, బి.జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

