PJTSAU | వ్యవసాయ యూనివర్సిటీ (హైదరాబాద్ ) జూలై 4 : ఈనెల 8 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 8 నుంచి 11 వరకు నిర్వహించే ఈ కౌన్సెలింగ్లో విద్యార్థులను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా ఎంపిక చేయబడుతుందన్నారు. రాజేంద్రనగర్లోని వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అర్హత గల వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు, నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. మిగతా వివరాలను వర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు.