చర్లపల్లి, జనవరి 7: ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక భద్రతా సంస్థగా పీఎఫ్ పేరు గాంచిందని, కార్మికులు పీఎఫ్‌ను సద్వినియోగం చేసుకొవాలని అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీఐఏ భవనంలో చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, గ్రాండ్ ఇండస్ట్రియల్ కాన్క్లేవ్ సంయుక్త ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ‘2.0 చాలెంజస్, ఆపర్చ్యునిటీవ్స్ వే ఎహెడ్’ అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పారిశ్రామికవాడలలో పనిచేస్తున్న కార్మికులు తప్పనిసరిగ్గా పీఎఫ్‌ను తీసుకోవాలని ఆయన సూచించారు.
ఎనిమిది కోట్ల క్రీయాశీల కార్మికులకు సేవలందిస్తున్నదని, కార్మికుల నిధి మా వద్ద 25 లక్షల కోట్లు ఉందన్నారు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఐలా చైర్మన్ రోషిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోనే చర్లపల్లి పారిశ్రామికవాడ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని, చర్లపల్లి పారిశ్రామికవాడలో 15 వందలకు పైగా చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలు ఉన్నాయన్నారు. పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం, బీఎస్ఈ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సంజన్ షా, బీఎస్ఈ గ్రౌండ్ అధ్యక్షుడు వంశీకృష్ణ, మీరా ఈవెంట్స్ ప్రతినిధి ఆనంద్, ఈఎస్ఐసీ డిప్యూటీ డైరక్టర్ నార్ల మహేశ్, నిచ్బ్రెయిన్స్ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ లక్ష్మి నర్సింహమూర్తి, సీఐఏ అధ్యక్షుడు గోవింద్‌రెడ్డి, కార్యదర్శి అప్పిరెడ్డిలు ప్రసగించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు రాజేశ్, నిశన్ సింగ్, సందీప్‌రెడ్డి, హరి సూర్య, సతీశ్ కుమార్, మేడ్చల్, సిద్దిపేట జోనల్ మేనేజర్ అనూరాధ, రఘువీర్, ప్రశాంత్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.