చెత్త కుంపటి వద్దు
జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో.. నగరవాసుల కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది.. దుర్వాసన..కాలుష్యం..అనారోగ్యంతో అక్కడి ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో..మాటల్లో చెప్పలేం. ఈ నేపథ్యంలో మరో జవహర్నగర్లా ఇంకో ప్రాంతాన్ని మార్చేందుకు సర్కార్ పావులు కదుపుతున్నది.
- మరో జవహర్నగర్లా మార్చొద్దు
- సిద్ధాపూర్, బండరావిరాలలో డంపింగ్పై తీవ్ర వ్యతిరేకత
- గాలి.. నేలా.. నీరు కాలుష్యంపై భయాందోళనలు
- సర్కార్ నిర్ణయంపై పోరాటానికి సిద్ధమవుతున్న ప్రజలు
రంగారెడ్డి, జూలై 3 (నమస్తే తెలంగాణ) : జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో..
నగరవాసుల కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నది.. దుర్వాసన..కాలుష్యం..అనారోగ్యంతో అక్కడి ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో..మాటల్లో చెప్పలేం. ఈ నేపథ్యంలో మరో జవహర్నగర్లా ఇంకో ప్రాంతాన్ని మార్చేందుకు సర్కార్ పావులు కదుపుతున్నది. సిటీ చెత్త కుంపటిని సిద్ధాపూర్, బండరావిరాల గ్రామస్తులు నెత్తిన రుద్దాలని చూస్తున్నది. జవహర్నగర్ అనుభవం దృష్ట్యా ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎకో పార్కు పేరుతో చెత్తను డంపింగ్ చేసి.. రీసైక్లింగ్ చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
జవహర్నగర్ లాంటి పరిస్థితులు మాకొద్దంటూ.. నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సిద్ధాపూర్ గ్రామంలోని సర్వేనంబర్ 252, 278, 361లో ఉన్న 86 ఎకరాల ప్రభుత్వ భూమిని చెత్త డంపింగ్ కోసం హెచ్ఎండీఏకు కేటాయిస్తూ టీజీఐఐసీ జీవో సైతం జారీ చేసింది. ఇందులోభాగంగా హెచ్ఎండీఏ ఆ భూమిని రాంకీ సంస్థకు కేటాయించింది. దీంతో సిద్ధాపూర్ పరిసరాల్లో ఉన్న పచ్చని పొలాలు, పల్లెలను కలుషితం చేయాలన్నా సర్కార్ నిర్ణయంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

