మెహిదీపట్నం/సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు ట్రాఫిక్ తిప్పలు తప్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సిటీ జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. శనివారం మెహిదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్,టోలీచౌకి ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఎక్కడెక్కడ యూటర్న్లు, డివైడర్లు ఏర్పాటు చేయాలి, ఫ్రీ లెఫ్ట్‌లు తదితర అంశాలపై చర్చించి..పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీసీపీ కరుణాకర్, అడిషినల్ డీసీపీ ప్రసాద్ , గోషామహల్ ఏసీపీ కోటేశ్వర్ రావు, టోలీచౌకి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు శంకర్‌రెడ్డి, ఈఈ శివానంద్, లాల్‌సింగ్ తదితరులు ఉన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సిటీబ్యూరో, జనవరి 29(నమస్తే తెలంగాణ): మహాత్మా గాంధీ వర్ధంతి నేపథ్యంలో ఆదివారం లంగర్‌హౌజ్ బాపూఘాట్ వద్ద ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గాంధీజీకి నివాళులర్పించేందుకు గవర్నర్, సీఎం హాజరుకానుండటంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.