కుత్బుల్లాపూర్,డిసెంబర్11: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను సోమవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ఫగుఛ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు నియోజకవర్గాన్ని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ఎంఎన్రెడ్డినగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు సూదుల సంపత్గౌడ్, వీరారెడ్డి నరేందర్రెడ్డి, రాంచంద్రారెడ్డి, భూలక్ష్మణ్, తిరుమలేశ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.