Pandala Harinath Goud | అబిడ్స్, మే 31: ప్రతి ఉద్యోగికి జీవితంలో పదవీవిరమణ తప్పనిసరి అని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ ముఖ్య కో ఆర్డినేటర్ జి. వేణుగోపాల్ అన్నారు. ఈ మేరకు ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో సీనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పండల హరినాథ్ గౌడ్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
హరినాథ్ 35 సంవత్సరాలుగా నిరంతరం నిరుపేద ప్రజల ఆరోగ్య సమస్యలను రక్త పరీక్షల ద్వారా తెలుసుకొని రోగ రహిత సమాజ కోసం ఎనలేని కృషిచేసి అందరి ప్రజల మన్నలను పొందారని వేణుగోపాల్ ప్రశంసించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ OBC సెల్ ఉపాధ్యక్షులు కాశమాని షాంరావ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఎనలేని కృషిచేసి సహ ఉద్యోగులతో పాటు స్థానిక ప్రజల ఉద్యోగ విధినిర్వహణలో పై అధికారులచే ఎన్నో ప్రశంసలు అందుకున్నారని అన్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ పంపిన ఒక సందేశంలో హరినాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ తరఫున వైద్యరంగంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ ఎనలేని కృషి చేస్తున్నందుకు పి హరినాథ్ గౌడ్‌కు లైఫ్ టైం అచీవ్మెంట్ 20 25ను అంద జేశారు.