పడావుబడ్డ 3500కి పైగా బోర్లు
మహానగరానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. పతి నీటి బొట్టును విలువైనదిగా భావించి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని జలమండలి ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
- రిపేర్లు చేయకపోవడంతో వందలాదిగా గల్లంతు
- పనిచేయకున్నా రూ.కోట్లలో కరెంట్ బిల్లుల బకాయిలు
- రిపేర్లు చేయాలని వినియోగదారుల నుంచి వందలాదిగా వినతులు
సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): మహానగరానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. పతి నీటి బొట్టును విలువైనదిగా భావించి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని జలమండలి ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. నగరానికి తాగు నీరు అందిస్తున్న అన్ని తాగునీటి వనరులను వినియోగించుకుని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని ప్రకటిస్తున్నారు. నీటి ఎద్దడి ఏర్పడిన ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి నీటిని అందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు.
నీటిని పొదుపుగా వినియోగించుకో వడం, వృథాను అరికట్టడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కానీ..జలమండలిలో పరిధిలోని వేలాది బోర్లను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. పైపులైన్ సరఫరాతో పాటు ఆయా ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటుచేసిన బోర్లను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జలమండలి పరిధిలోని 3,500పైగా ఉన్న బోర్లన్నీ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లు కనుమరుగవుతున్నాయి. బోర్లు అందుబాటులో లేకున్నా కరెంట్ బిల్లు మాత్రం నెలనెలా వస్తున్నది. మరి కొన్ని చోట్ల పూర్తిగా శిథిలమై దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల బోర్లు పనిచేస్తూ.. నీటి నిల్వలు సమృద్ధిగాఉన్నావినియోగించుకోకపోవడంతో వృథాగా పడి ఉంటున్నాయి. ఈ బోర్లను గుర్తించి వినియోగంలోకి తీసుకొస్తే కొంతమేర నీటి సమస్య తీరనుంది.
ఇప్పటికైనా జలమండలి అధికారులు ఆయా ప్రాంతాల్లోని బోర్లను గుర్తించి మరమ్మతులు చేసి నీటి సరఫరా పునరుద్ధరించాలని నియోగదారులు కోరుతున్నారు. నిర్లక్ష్యపు నీడలో ఏండ్ల నాటి బోర్లు జలమండలి రిజర్వాయర్లు, ఇతర నీటి వనరులతో పాటు ఆయా ప్రాంతాల్లోనే బోర్లు వేసి నీటిని సరఫరా చేస్తున్నది. కొన్ని కాలనీలకు జలమండలి పైపులైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతో అక్కడే బోర్లు వేసి పరసరాల్లోని వినియోగదారులకు నీటిని సరఫరా చేస్తున్నారు.
కానీ కొనేండ్లుగా ఆయా కాలనీల్లో వేసిన బోర్లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చిన్న చిన్న రిపేర్లకు గురవుతున్న బోర్లకు మరమ్మతులు చేయించకపోవడంతో ఏండ్ల తరబడిగా నిరుపయోగంగా ఉంటున్నాయి. రోజులు గడుస్తుండటంతో శిథిలమైపోతున్నాయి. నగరం రోజురోజుకు విస్తరిస్తుండటంతో ఆ బోర్లన్నీ కాలగర్భంలో కలిసిపోయి.. కనుమరుగవుతున్నాయి. జలమండలి వ్యాప్తంగా 3500 పైగా బోర్లుంటే వాటిలో 80 శాతం వినియోగంలో లేవు.
సగానికి పైగా బోర్లు ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియని పరస్థితి నెలకొన్నది. ఆయా డివిజన్లలో అధికారులు మారుతున్న కొద్దీ ఏ ప్రాంతంలో జలమండలి బోర్లున్నాయో కూడా గుర్తించలేని దుస్థితి ఏర్పడింది. బోర్లు ఎక్కడున్నాయో తెలియకున్నా కరెంట్ బిల్లు మాత్రం వస్తున్నది. వినియోగంలో లేనివి, గల్లంతైన బోర్లకు కూడా మినిమం బిల్లు రూ.250 నుంచి రూ.270 దాకా ప్రతి నెలా జలమండలి సెక్షన్ ఆఫీసులకు వస్తున్నది. నిరుపయోగంలో ఉన్న బోర్లకు బిల్లులు వస్తుండటంతో ప్రస్తుతమున్న అధికారులు చెల్లించడంలేదు. దీం తో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి.
వినియోగిస్తే నీటి ఎద్దడికి చెక్
జలమండలి బోర్లను నగరంలోని అన్ని ప్రాంతాల్లో గుర్తించి వినియోగంలోకి తీసుకొస్తే ప్రస్తుతం ఏర్పడుతున్న నీటి ఎద్దడిని తగ్గించవచ్చు. ఇప్పటికే ఆయా ప్రాంతాల వినియోగదారుల నుంచి జలమండలి అధికారులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో అధికారులు నిరుపయోగంగా ఉన్న బోర్లపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వెస్ట్ సిటీలోని 7 నియోజకవర్గాలకు రాబోయే రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడనుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని బోర్లను మరమ్మతులు చేస్తే కొంతమేర నీటి సమస్యను తగ్గించే అవకాశం ఉంటుంది.
ఆయా ప్రాంతాలపై దృష్టిసారించి మరమ్మతులు చేయాల్సినవి, పూర్తిగా కనుమరగైనవి, వినియోగంలో ఉన్నవాటిని గుర్తించాలని జలమండలి వినియోగదారులు కోరుతున్నారు. ప్రైవేట్ బోర్లు, అక్రమంగా నిర్వహిస్తున్న బోర్లకు అడ్డుకట్ట వేసి జలమండలి పరిధిలోని బోర్లను వినియోగంలోకి తీసుకురావాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఆ దిశగా పనిచేస్తే రానున్న నీటి విపత్తును కొంతమేర అదుపు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రణాళిక ప్రకారం అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి జలమండలి బోర్లపై సర్వే చేపట్టి గుర్తించాలని సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగిస్తే జలమండలికి కొంతమేర ఊరట కలుగుతుంది. దీంతో ట్యాంకర్ల వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

