Ovarian tumor | హైదరాబాద్ : ఓ వృద్ధురాలి కడుపులో నుంచి 5 కిలోల అండాశయ కణితి( ovarian tumor )ని లంగర్హౌజ్లోని రెనోవా ఆస్పత్రి( Renovo Hospitals ) వైద్యులు తొలగించారు. కడుప నొప్పి( abdominal pain )తో బాధపడుతున్న ఆ వృద్ధురాలు ఇటీవలే ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె స్కానింగ్ నిర్వహించగా, అండాశయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ వృద్ధురాలికి వైద్యులు శస్త్ర చికిత్స( Surgery ) నిర్వహించి కణితిని తొలగించారు.
ఈ కణితి బరువు 4 నుంచి 5 కిలోల బరువు ఉంటుందని డాక్టర్లు తెలిపారు. అయితే 25 ఏండ్ల క్రితం బాధితురాలికి గర్భాశయాన్ని తొలగించారు. ఆ తర్వాత నుంచి ఆమె కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి, డాక్టర్ సంజయ్ యాదగిరి, జనరల్ సర్జన్ డాక్టర్ గంగాధర్, అనస్థియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కలిసి ఈ సర్జరీ నిర్వహించారు.