Osmania Hospital Victims | బీఆర్ఎస్ ఉన్నపుడు మాకేం ఇబ్బంది లేకుండే. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు నిద్ర లేదు. మాకు న్యాయం కావాలి.. న్యాయం లేదిపుడు.. ఓటేందుకు వేస్తం.. మహిళలకు న్యాయం జరుగుతుందని నమ్మి ఓటేసినం. నమ్ముకుంటే మమ్మల్ని ముంచేసిండని రేవంత్ రెడ్డిపై మండిపడ్డది.. అంటూ బేగంబజార్, బాలయ్య వాడ బస్తీలో నూతన ఉస్మానియా ఆసుపత్రి బాధితులు వాపోతున్నారు.
బాలయ్య వాడ బస్తీలో ఓ బాధిత మహిళ మాట్లాడుతూ..మాకున్నదే ఒక్క ఆధారం ఈ ఇల్లు. ఇక ఇల్లు పోతే మేమిక్కడికి పోవాలే.. మాకేం ఆధారం లేదు. జాబులు కూడా లేవు. ఇల్లుందన్న భరోసాతో ఏదో ఒక పనిచేసుకుని బతుకుతున్నం. పని లేదు.. జాబులు లేవు.. ఇల్లు లేదు. ఏం కావాలే సార్ మేము మా పిల్లలు రోడ్డున పడాలా..? అని ప్రశ్నించాలి. రోజుకొక నోటీస్ తీసుకొని వస్తరు.. మాకు నోటీసు ఎందుకిస్తరు. మా ఇల్లు మేం కట్టుకున్నం. రిజిస్ట్రేషన్ ఉంది. చూడండి. మేమేం దోచుకోలేదు.. కబ్జా చేసుకొని కట్టుకోలేదు. మేమైతే ఇల్లు ఇయ్యామని కరాకండిగా చె్ప్పేసింది. మీరు ఉస్మానియా కడుతున్నరు.. మీ జాగాలో మీరు కడ్తున్నరు.. కట్టుకోండ్రి.. మేమేం వద్దనం. మా గల్లీకి మాత్రం రావొద్దు.. వెనుక మరో ఆప్షన్ ఉందంటూ చెప్పుకొచ్చింది.
రేవంత్ రెడ్డి సార్ దయచేసి మా ఇళ్ల జోలికి రావొద్దు.. మేము రోడ్డు మీద పడతాం
మేము ఏమీ ఇల్లు కబ్జా చేసి కట్టుకోలేదు.. రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్నాము
మేము మా ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదు – బేగంబజార్, బాలయ్య వాడ బస్తీలో నూతన ఉస్మానియా ఆసుపత్రి బాధితులు https://t.co/jdCYfg38Tl pic.twitter.com/TEQXIYw6qS
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు