శంషాబాద్ రూరల్, అక్టోబర్ 11: ఆర్గానిక్ వ్యవసాయ పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్ రాంరెడ్డి అన్నారు. మల్కారం గ్రామ పంచాయతీ పరిధిలోని పంచరత్నం ఆర్గానిక్ ఫామ్‌ను హార్టికల్చర్ అధికారుల బృందం సోమవారం సాయంత్రం పర్యటించి పంటల సాగును పరిశీలించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ కమిషనర్ వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ పంటలు కెమికల్ ఎరువులు కాకుండా సాధారణ ఎరువుల (ఆర్గానిక్) ద్వారా పంటలు సాగు చేయడంతో ప్రజల ఆర్యోగానికి ఎంతో మేలు జరుగుతుంది. కెమికల్ ఎరువుల ద్వారా పంటల సాగు చేయడం భారీగా ఉండటంతో, వాటిని తింటున్న ప్రజలు పలు రకాల అనారోగ్యానికి గురవు తున్నారని వివరించారు.
ఆర్గానిక్ ఎరువులు వాడి పంటలు సాగు చేయడం ద్వా రా ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటుందని, దీంతో పాటు ఆరోగ్యకరంగా ఉంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర శివారులో ఆర్గానిక్ పంటల సాగు భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు ఆర్గానిక్ సాగుపై అవగాహన కల్పిస్తే సాగు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. పంటలను పరిశీలించిన వారిలో హార్టికల్చర్ అధికారులు సునందారాణి, చక్రపాణి, భాగ్యలక్ష్మీ, జి.సంజయ్ కుమార్, టి.ఉషారాణి తదితరులు ఉన్నారు.