విద్యార్థుల బస్పాసులకు ఆన్లైన్ దరఖాస్తులు షురూ
విద్యార్థుల బస్పాసులు | జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల బస్సు పాసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. బస్పాసుల కోసం విద్యార్థులు సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల బస్సు పాసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. బస్పాసుల కోసం విద్యార్థులు సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దరఖాస్తుల తర్వాత విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్ల అనుమతి మేరకు విద్యార్థులకు ఉచిత బస్సు పాసులతో పాటు జనరల్, వికలాంగుల పాసులను కూడా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న వారందరూ నగరంలో ఏర్పాటు చేసిన 40 కేంద్రాల వద్ద బస్పాస్కు చెందిన ఐడీ, బస్సు పాసులు పొందే విధంగా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ప్రతి రోజు ఉదయం 6.30 నుంచి 8.15 వరకు అన్ని కేంద్రాలలో పాసులు జారీ చేయనున్నారు. బస్పాసు కేంద్రాలు, ఆన్లైన్ దరఖాస్తులు, ఇతర పూర్తి వివరాల కోసం https://online.tsrtcpass.in వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

