సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మరోసారి పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.4 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.