Rains | వాయువ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపునకు వీస్తుండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం బేగంపేట్, పీజేఆర్ స్టేడియం, లింగంపల్లి, మలక్‌పేట్, షేక్‌పేట్, బతుకమ్మకుంట, బీహెచ్ఈఎల్, డబీర్‌పురా, నాంపల్లి, మాసబ్‌ట్యాంక్, హిమాయత్‌నగర్‌తో పాటు నగరంలోని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురిశాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 31.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.4 డిగ్రీల సెల్సియస్‌గా, గాలిలో తేమ 65 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.