KTR | హైదరాబాద్‌ను మరో మెట్టు ఎక్కించాల్సిన బాధ్యత వాళ్లదే : కేటీఆర్
KTR | అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్’ తాజా నివేదిక (2023) కుండబద్దలు కొట్టింది.
KTR | అంతర్జాతీయ సూచికలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. గత 10 ఏండ్లుగా స్థిరమైన పాలన, ప్రశాంత రాజకీయ వాతావరణం ఫలితంగా హైదరాబాద్ నగరంలో జీవన నాణ్యత మెరుగుపడిందని ‘మెర్సర్స్ క్వాలిటీ ఆఫ్ ఇండెక్స్’ తాజా నివేదిక (2023) కుండబద్దలు కొట్టింది. మెర్సర్స్ వరల్డ్‌వైడ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ (జీవన నాణ్యత) తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి హైదరాబాద్‌కు అత్యుత్తమ ర్యాంక్ దక్కింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ( ఎక్స్) ద్వారా స్పందించారు. అంతర్జాతీయ సూచీలో హైదరాబాద్ ఘనత సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
గడిచిన తొమ్మిదేండ్లకాలంలో హైదరాబాద్ నగరం ఆరుసార్లు మెర్సర్ జాబితాలో టాప్‌లోనే నిలిచిందని కేటీఆర్ గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేశామని తెలిపారు. ఇప్పుడు దాన్ని మరో మెట్టు ఎక్కించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపైనే ఉందని పేర్కొన్నారు.
మెర్సర్స్ జీవన నాణ్యత ర్యాంకింగ్స్‌లో బెంగళూరు, పుణే వంటి నగరాలను భాగ్యనగరం వెనక్కి నెట్టింది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 153వ స్థానంలో నిలువగా, పుణెకు 154, బెంగళూరుకు 156 ర్యాంకులు దక్కాయి. చెన్నై(161), ముంబై (164), కోల్‌కతా (170), న్యూఢిల్లీ (172) నగరాలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో విదేశీ ఉద్యోగులు, ప్రవాసులు, వారి కుటుంబాల రోజువారీ జీవనం.. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ‘మెర్సర్స్’ ఈ ర్యాంకుల్ని విడుదల చేసింది.
ఈ ర్యాంకింగ్స్‌లో భారత దేశానికి చెందిన 7 నగరాలు మాత్రమే చోటు దక్కించుకోగా, అందులో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవటం విశేషం. వివిధ దేశాలకు చెందిన ఉద్యోగులు, వారి కుటుంబాలకు అత్యంత నాణ్యతతో కూడిన జీవన పరిస్థితులు హైదరాబాద్ నగరంలో ఉన్నాయన్న సంగతి ‘మెర్సర్స్ ఇండెక్స్’ గణాంకాలతో సహా చూపుతున్నది. ఆర్థిక పరిస్థితులు, రాజకీయ హింస లేకపోవటం, సామాజిక సమానత్వం.. వంటివి ర్యాంకింగ్స్‌లో పరిగణనలోకి తీసుకోగా, భారత్‌లో మిగతా అన్ని నగరాలకన్నా హైదరాబాద్ మెరుగైన స్థానంలో నిలిచింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

