చిక్కడపల్లి, మే 26: రాష్ట్రంలో గీత కార్పొరేషన్ ద్వారానే నీరా కేఫ్‌లను నిర్వహించాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ గౌడ్ మాట్లాడుతూ.. ఆగస్టు 18వ తేదీలోపు జనగామ జిల్లా పేరును పాపన్న జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు పెండింగ్‌లో ఉన్న గీతన్నల నష్టపరిహారం, కొత్త పెన్షన్లు ఇవ్వాలన్నారు. ఉత్తర తెలంగాణలో గీత వృత్తిదారులపై జరుగుతున్న వీడీసీల దాడులను అరికట్టాలని అన్నారు. ప్రతి జిల్లాలో నీరా కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. చనిపోయిన గీత కార్మికుడికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు నక్క కృష్ణ గౌడ్, సర్వాయి పాపన్న మోకు దెబ్బ అధ్యక్షుడు జక్క వీరస్వామి, పటేల్ వెంకటేశ్ గౌడ్, జైగౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బురా మల్సూర్, సోషల్ డెమోక్రటిక్ జాతీయ అధ్యక్షుడు కోల జనార్ధన్, శ్రీకాంత్ గౌడ్, కూరెల్ల వేములయ్య, బొనగాని యాదగిరిగౌడ్, ముద్ద గౌని రామ్మోహన్ గౌడ్, పరశురాం గౌడ్
తదితరులు పాల్గొన్నారు.