ఔటర్ మార్గం ప్రగతి హారం.. ఓఆర్ఆర్ అభివృద్ధిపై హెచ్ఎండీఏ ఫోకస్
గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార,వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్ని ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్నాయి. మహానగరానికి మణిహారంలా మారిన 158 కి.మీ ఓఆర్ఆర్ చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి
- 22 ఇంటర్‌చేంజ్‌లు, సర్వీస్ రోడ్ల ఆధునీకరణకు ప్రణాళికలు
- రూ. 8.44 కోట్లతో ఔటర్ చుట్టూ టోల్ మేనేజ్మెంట్ సిస్టంల ఆధునీకరణ
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు కేంద్రంగా అభివృద్ధి కేంద్రీకృతమైంది. కొత్తగా నివాస ప్రాంతాలతో పాటు వ్యాపార,వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలు ఇలా అన్ని ఓఆర్ఆర్కు ఇరువైపులా ఏర్పాటవుతున్నాయి. మహానగరానికి మణిహారంలా మారిన 158 కి.మీ ఓఆర్ఆర్ చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ఎంతో ఆసక్తి చూపుతున్నాయి. 2012 నుంచి దశల వారీగా అందుబాటులోకి వచ్చిన ఓఆర్ఆర్ 2018 నాటికి పూర్తి స్థాయిలో రాకపోకలు సాగిస్తూ, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
22 ఇంటర్‌చేంజ్‌లు..
రూ.8.44 కోట్లతో ఓఆర్ఆర్ చుట్టూ 22 చోట్ల టోల్ మేనేజ్మెంట్ సిస్టంల ఆధునీకరణ పనులు చేపట్టనున్నారు. పెద్ద గోల్కొండ ఇంటర్చేంజ్ వద్ద అప్ అండ్ డౌన్ ర్యాంప్స్ ఏర్పాటు, టోల్ బూత్‌ల రిలోకేషన్, ఎలక్ట్రికల్, ఐటీఎస్ పనులతో పాటు సర్వీసు రోడ్డును జంక్షన్‌ను అభివృద్ధి చేయడం వంటి పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం సుమారు రూ.8.96 కోట్లతో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అధికారులు ఇటీవల టెండర్లు పిలిచారు. నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు, తిరిగి పోలీస్ అకాడమీ నుంచి కొల్లూరు వరకు రూ. 300 కోట్ల సర్వీసు రోడ్లను ఒక్కో వైపు 2 వరసల నుంచి 4 వరసలతో అభివృద్ధి చేస్తున్నారు. రూ.90 కోట్లతో 23 కి.మీ మేర సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.
మౌలిక వసతుల కల్పన ఇలా..
- మంచినీటి సరఫరా కోసం గోదావరి, కృష్ణా నదుల నుంచి వచ్చే పైపులైను మార్గాలను కలుపుతూ ఓఆర్ఆర్ చుట్టూ రింగు మెయిన్ పేరుతో భారీ పైపు లైను నిర్మాణం.
- మెట్రోస్టేషన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గం.
- రైల్వే మార్గాలు ఓఆర్ఆర్కు 4 చోట్ల అనుసంధానమై ఉండగా, సమీపంలోనే కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్‌ను నిర్మించాలన్న ప్రతిపాదన.
- 23 కి.మీ మేర ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సోలార్ రూఫ్ టాప్‌తో కూడిన సైకిల్ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు.
- ఓఆర్ఆర్కు ఇరుపువైపులా 1 కి.మీ వరకు గ్రోత్ కారిడార్‌గా నిర్ణయించారు. దీని పరిధిలో సర్వీసు రోడ్లకు సమాంతరంగా 100 అడుగుల రోడ్డును నిర్మించడంతో పాటు అంతర్గతంగా గ్రిడ్ రహదారులను అభివృద్ధి చేసేలా గ్రోత్ కారిడార్ భవిష్యత్ ప్రణాళికను అమలు చేస్తున్నారు.
- ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను గుర్తించి, ఓఆర్ఆర్ బయటకు దశల వారీగా తరలించే ప్రయత్నాలు .
- బాటసింగారం, మంగళ్పల్లిలో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.
- తాత్కాలికంగా పండ్ల మార్కెట్ బాట సింగారంలోని లాజిస్టిక్ పార్కులో ఏర్పాటు చేయగా, శాశ్వత మార్కెట్ నిర్మాణ పనులు కొహెడలోని 100 ఎకరాల్లో కొనసాగుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Decoration
- Hyderabad
- Nature
- ORR
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

