జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉప్పల్ భగాయత్ శిల్పారామం సమీపంలో సోమవారం చేనేత భవనం, మ్యూజియం నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అక్కడినుంచి మన్నెగూడలో నిర్వహించిన చేనేత సంబురాల్లో మంత్రి పాల్గొని నేతన్నలకు వరాలు కురిపించారు.
అలాగే గతంలో ఉన్న పథకాల కింద అందజేస్తున్న సాయాన్ని పెంచారు. చేనేత రంగంపై మంత్రి వరాల జల్లు కురిపించడంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.