హయత్‌నగర్, సెప్టెంబర్ 1:నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్, హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ పాలకవర్గ సభ్యుల ఎన్నికలను 28న హయత్‌నగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు మదర్ డెయిరీ ఎన్నికల అధికారి జీవీ హన్మంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఆరు పాలకవర్గ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారన్నారు. 17, 18, 20, 21, 22 తేదీల్లో నామినేషన్ ఫారాలు ఇస్తారని, 20, 21, 22 తేదీల్లో స్వీకరణ, 23న పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం, అదేరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎన్నికల బరిలో ఉన్నవారి పేర్లు ప్రకటిస్తారని తెలిపారు. 28న ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారని వివరించారు.