Footpath Shops | కుటుంబమంతా కాళ్లు, చేతులు మొక్కినా పట్టించుకోలేదు.. ఫుట్‌పాత్‌పై షాపు కోల్పోయిన బాధిత మహిళ
Footpath Shops | జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కాళ్ళు, చేతులు మొక్కినా వినలేదని బేగంపేట్‌లో ఫుట్‌పాత్‌పై షాపు కోల్పోయిన ఓ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
Footpath Shops | జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో బేగంపేట్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపులను కూల్చేశారు. సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు.. కాళ్ళు, చేతులు మొక్కినా వినలేదని బేగంపేట్‌లో ఫుట్‌పాత్‌పై షాపు కోల్పోయిన ఓ బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
బుల్డోజర్ల దౌర్జన్యంలో షాపు కోల్పోయిన బాధిత మహిళ మాట్లాడుతూ..మాకు టైం కూడా ఇవ్వలేదు.. వచ్చి కూలగొడ్తనే ఉన్నరు.. నాకు భర్త లేడు. డబ్బా మీదనే బతకాలే. ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు. ఎట్లుండాలే. సడెన్ వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా..? కనీసం ఒక వారం ముందు చెప్పినా వెళ్లిపోయే వాళ్లమంది. కుటుంబమంతా కాళ్లు, చేతులు మొక్కినం.. అస్సలు పట్టించుకోలేదు. డబ్బాలున్నోళ్లమంతా వాళ్ల ముందు పడుకున్నాం. వెళ్లగొట్టేస్తున్నరు.. దేవుడికన్నా మొక్కితే కనికరం ఉంటది. వీళ్లయితే మరీ అన్యాయం చేస్తున్నరు. రెండు నెలల నుంచి నడుస్తుంది ఇట్లా. కేసీఆర్ ఉన్నప్పుడు మాకేం తక్కువ కాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచే మాకు ఇట్లయితుంది.
నా భర్త చిన్నగున్నప్పుడు మా మామ ఈ డబ్బా పెట్టిండు. 50 సంవత్సరాల నుండి మా కుటుంబం ఈ షాపు మీదనే బ్రతుకుతుంది.. పక్కన చెప్పుల షాపుల నా కొడుకుంటాడు.. మొత్తం కూల్చేసిన్రు. నాకు భర్త కూడా లేడు నేను ఎలా బ్రతకాలి..? అని రేవంత్ రెడ్డి సర్కార్‌ను ప్రశ్నించింది. పెన్షన్ పెంచుతా అన్నడు.. వచ్చినప్పటి నుంచి పెన్షన్ కూడా పెంచలేదు. కేసీఆర్ ఇచ్చిన రూ.2వేలే వస్తున్నయ్. బతుకమ్మ చీరలిస్తా అన్నడు… ఏమీ రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వలేదు.. కాళ్ళుచేతులు మొక్కినా వినలేదు
కనీసం ఒక వారం ముందు చెప్పినా వెళ్లిపోయే వాళ్ళము
50 సంవత్సరాల నుండి మా కుటుంబం ఈ షాపు మీదనే బ్రతుకుతుంది.. నాకు భర్త కూడా లేడు నేను ఎలా బ్రతకాలి?
బేగంపేట్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న షాపులను కూల్చేసిన అధికారులు https://t.co/yFuyg83Hm3 pic.twitter.com/47g2iIEBpV
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2026
బేగంపేట్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న పేదల షాపులను కూల్చేసిన అధికారులు https://t.co/L5UkdeyoE4 pic.twitter.com/eH9jCYtYxX
— Telugu Scribe (@TeluguScribe) April 9, 2026
Read Also :
Sunetra Pawar: బారామతి బైపోల్స్.. తప్పుకున్న కాంగ్రెస్.. సునేత్ర పవార్ ఏకగ్రీవం !
Footpath Shops | రేవంత్ రెడ్డి వచ్చినంక నిద్ర కూడా రానంత భయమేస్తుంది.. చిరు వ్యాపారి ఆవేదన
Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీలో చేరడం పక్కా : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

