Musi Victims | రియల్ ఎస్టేట్ చేసే రేవంత్ రెడ్డికి మూసీ ఏటీఎంలాగా దొరికింది.. మూసీ బాధితుడు
musi victims | గాంధీ పేరుమీద గాడ్సే పని చేస్తున్నరు. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కూడా నమ్మడానికి వీలు లేదు. ఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ పార్టీల వాళ్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని మూసీ బాధితుడు మండిపడ్డారు. .
Musi Victim | కాంగ్రెస్ సర్కార్ గాంధీ పేరు చెప్పి గాడ్సే పనులు చేస్తుందని.. రియల్ ఎస్టేట్ చేసే రేవంత్ రెడ్డికి మూసీ ఏటీఎం లాగా తయారైందని ఓ మూసీ బాధితుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మూసీ సుందరీకరణ, గాంధీ విగ్రహం పేరుతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సదరు బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ పేరుమీద గాడ్సే పని చేస్తున్నరు. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కూడా నమ్మడానికి వీలు లేదు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అనిఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ పార్టీల వాళ్లు చెప్పారు.. జీరో వ్యాల్యూ చేయడానికి ముఖ్యమంత్రి ఎవరు.. ప్రజలు సీఎంను వచ్చే ఎన్నికల్లో జీరో వ్యాల్యూ చేస్తరు. నష్టపరిహారం ఎవరికీ అవసరం లేదు. ఎవరి ఇల్లు వాళ్లకే ఉండాలి. ఈయన ప్రభుత్వం రాగానే మూసీ మీద కన్నేసిండు. ప్రభుత్వానికి మూసీ ఒక ఏటీఎంలా దొరికిపోయింది. ఎట్లా అంటే అట్లా వాడుకుంటున్నరన్నాడు.
మూసీ పేరు మీద వరల్డ్ బ్యాంక్ నుంచి లేదా ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి కానీ ఏదైనా బ్యాంక్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రుణాలు తీసుకొచ్చి మింగుతున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ మాఫియాలా పెరిగిపోయింది. మా భూమి గుంజుకొని రియల్ ఎస్టేట్ చేయడానికి వాళ్లు ఎవరు. మీరు తెలంగాణను, ప్రజలను బాగు చేయాలంటే ఏడు పెద్ద ప్రభుత్వాసుపత్రులున్నాయి. వాటిని బాగు చేయండి. రిక్రూట్ మెంట్ చేసి ఉద్యోగాలివ్వండని డిప్యూటీ సీఎంకు చెప్పినమన్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ పేరు చెప్పి గాడ్సే పనులు చేస్తున్నారు
రేవంత్ రెడ్డి రెడ్డిని నమ్మడానికి లేదు ఈయన RSS మనిషి
రియల్ ఎస్టేట్ చేసే రేవంత్ రెడ్డికి మూసీ ఏటీఎం లాగా తయారైంది – మూసీ బాధితుడు pic.twitter.com/GNXU0oXDEe
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2026
గాంధీ లాంటి అహింసావాది విగ్రహం కోసం ఇంత హింస చేస్తున్నారని మధు రిడ్జ్ అపార్ట్మెంట్ బాధితుడు ఆరోపించాడు. రేవంత్ రెడ్డికి డబ్బులు, ఆస్తి ఉందని.. మా మధ్యతరగతి వారి కష్టాలు ఆయనకు తెలియవని అన్నాడు. మా ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నాయని కూల్చేస్తే, ఆ తర్వాతే కట్టే బిల్డింగ్లు కూడా బఫర్ జోన్లోనే ఉంటాయి కదా.. అవి ఎలా కడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు.
గాంధీ లాంటి అహింసావాది విగ్రహం కోసం ఇంత హింస చేస్తున్నారు
రేవంత్ రెడ్డికి డబ్బులు, ఆస్తి ఉంది మా మధ్యతరగతి వారి కష్టాలు ఆయనకు తెలియవు
మా ఇండ్లు బఫర్ జోన్లో ఉన్నాయని కూల్చేస్తే, ఆ తర్వాతే కట్టే బిల్డింగ్లు కూడా బఫర్ జోన్లోనే ఉంటాయి కదా.. అవి ఎలా కడతారు – మధు రిడ్జ్ అపార్ట్… https://t.co/oP2Wk6Sbpq pic.twitter.com/5239yoKwNW
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2026
Read Also :
Bandlaguda | ఔటర్ రింగ్ రోడ్ పై లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Dhurandhar 2 Blunder | ‘ధురంధర్ 2’ యాక్షన్ సీన్లో కెమెరామెన్ ప్రత్యక్షం.. నెటిజన్ల ట్రోలింగ్.!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

