సికింద్రాబాద్ డీసీపీ కార్యాయం వద్ద ఉద్రిక్తత.. నిందితుడిని అప్పగించాలని బంధువుల ఆందోళన
సికింద్రాబాద్ డీసీపీ కార్యాయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక మోసెస్ అరులియాను కిరాతకంగా హతమార్చిన నిందితుడిని తమకు అప్పగించాలని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ డీసీపీ కార్యాయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల బాలిక మోసెస్ అరులియాను కిరాతకంగా హతమార్చిన నిందితుడిని తమకు అప్పగించాలని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని వెంటనే ఉరితీయాలని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. కాగా, కౌకూర్‌లోని విల్లా ఆర్చిడ్స్ అపార్ట్మెంట్లో మిల్టన్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె మోసెస్ అరులియా శనివారం రాత్రి అపార్ట్మెంట్ సెల్లార్లో ఆడుకుంటూ కొంత సేపటికే.. కనిపించకుండా పోయింది.
చిన్నారి జాడ కోసం అపార్ట్‌మెంట్‌తో పాటు పరిసరాల్లో వెతికిన కుటుంబసభ్యులకు రాత్రి సుమారు 11గంటల సమయంలో దుండగుడి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. చిన్నారి తాతతో ఫోన్‌కాల్ మాట్లాడిన దుండగుడు పాపను విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, చిన్నారి చంపి నీటి సంపులో పడేశాడు. నిందితుడు బీహార్‌కు చెందిన విక్రమ్ గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. ఉద్యోగం నుంచి తొలగించిన కొద్ది రోజులకే చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

