ఆధ్యాత్మిక, ధార్మిక చింతన కలిగించడంతో పాటు చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ప్రయాస్, ధార్మిక్ చిహ్న్’ల పేరిట ఏర్పాటు చేసిన సోలో పెయింటింగ్స్ ప్రదర్శనను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన చిత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిత్రకారులు పీఎస్ మూర్తి ప్రయాస్, సీనియర్ చిత్రకారులు నరేంద్ర రాయ్ వేసిన చిత్రాలు ఆహ్లాదకరంగా, మనస్సును హత్తుకునేలా ఉన్నాయని అన్నారు. ఈ ప్రదర్శనలో 58 చిత్రాలుండగా.. అక్టోబర్ 20 వరకు ప్రదర్శన కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.