Sudhir Reddy | పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
Sudhir Reddy | ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపుతాననీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు.
హైదరాబాద్ : ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపుతాననీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudhir Reddy) అన్నారు. ఆయన మార్నింగ్ వాక్‌లో భాగంగా ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని పెద్ద చెరువు, పరస్వతినగర్ కాలనీ, కాస్మోపాలిటీన్ కాలనీలలో స్థానిక నాయకులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి(Pedda cheruvu) డ్రైనేజీ మురుగు నీరు కలుస్తుందని స్థానికలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
చెరువు కలుషితం కావడంతో తీవ్ర దురువాసనతో అటుగా వెళ్లలేక పోతున్నామని తెలిపారు. చెరువులో మురుగు నీరు కలవకుండా చర్యలు చేపట్టాలని, ఇదే విధంగా సరస్వతినగర్ కాలనీలో డ్రైనేజీ విస్తరణ పనులు, కమ్యూనిటీ హాల్ పై అదనపు అంతస్తు నిర్మాణం, కాస్మోపాలిటీన్ కాలనీలలో డ్రైనేజీ విస్తరణ పనులు, కాలనీలోని పార్కు గోడ ఎత్తును పెంచే విధంగా చూడాలని నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..మన్సూరాబాద్ పెద్ద చెరువు మురుగు నీటితో కలుషితం కాకుండా చూడటంతో పాటు చెరువును సుదరీకరించి పర్యాట కేంద్రంగా(Tourist spot) తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ చెరువుతో పాటు నియోజకవర్గంలోని అన్ని చెరువులను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. త్వరలో ఆయా కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ విస్తరణ పనులు, కమ్యూనిటీ హాల్ పై అంతస్తు భవనం, పార్కు గోడ ఎత్తును పెంచే పనులను దశల వారిగా పూర్తి చేసేట్లు చర్యలు చేపడతాననీ ఎమ్మెల్యే ఆయా కాలనీ వాసులకు భరోసానిచ్చారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

