శంషాబాద్ రూరల్, నవంబర్ 8 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని సుల్తాన్‌పల్లి, కేబిదొడ్డి గ్రామాల్లో కోటి రూపాయల అభివృద్ధి పనులను సర్పంచ్ దండుఇస్తారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గ్రామాలకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలతో పాటు ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, బీసీ కమ్యూనిటీ హాల్స్, సీఎం రిలీఫ్‌ఫండ్, రైతు బంధు, రైతు బీమా ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. గ్రామాల్లో పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారని తెలిపారు.
గతంలో ఏ గ్రామంలో చూసిన మురుగునీరు రోడ్లపై పారుతుండేది, తెలంగాణ వచ్చిన నాటి నుంచి గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళలాడతున్నట్లు తెలిపారు. ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్విరాజు మాట్లాడుతూ గ్రామాలు గతంతో పోల్చితే ప్రస్తుతం అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయని తెలిపారు.
బండ్లగూడ,నవంబర్ 8: రాజేంద్రనగర్ నియోజకవర్గానికి తాగునీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సోమవారం జలమండలి ఎండీ దానకిశోర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఔటర్‌రింగ్ పరిధిలో ఉన్న గ్రామాలకు తాగునీటి వసతిని కల్పించాలని సీఎం కేసీఆర్ విడుదల చేసిన రూ. 1200కోట్లలో నియోజక వర్గం పరిధిలోని గ్రామాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ముప్ప టవర్లకు మంజీరా నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నార్సింగి వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, కౌన్సిలర్ పత్తి శ్రీకాంత్, ముప్పా టవర్స్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.