బండ్లగూడ,అక్టోబర్ 29: బస్తీల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టి, ఎప్పటి కప్పుడు చెత్తాచెదారం తొలగింపునకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆదేశి ంచారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో చెత్త సేకరణ కోసం నూతన డోజర్ వాహనం, మొక్కలు వాడి పోకుండా ఉండేందుకు నీరు పోసేందుకు తాగునీటి ట్యాంకర్‌ను కొనుగోలు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, శానిటేషన్ మేనేజర్ మనోహర్, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, కార్పొరేటర్లు చంద్రశేఖర్, రవీందర్‌రెడ్డి, ప్రశాంత్‌నాయక్, కోఆప్షన్ సభ్యులు జగదీశ్, మాలాకీ రత్నం, వెంకట్‌రెడ్డి,నాయకులు రావుల కోళ్ల నాగరాజు, పాండు, రాజిరెడ్డి, ప్రేమ్‌గౌడ్, నరేందర్, దశరథ్, ప్రవీణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మైలార్‌దేవ్‌పల్లి,అక్టోబర్29: రోడ్డు విస్తరణలో తమ ఇండ్ల పోతున్నాయంటూ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు బాధితులు మొర పెట్టుకున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ జాతీయ ప్రధాన రోడ్డులో 40 ఏండ్ల నుంచి ఇండ్లు నిర్మించుకుని ఉన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా 19 మంది పేద కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. దీంతో మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు అందజేస్తున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నివాసంలో బాధిత కుటుంబాలు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ..శనివారం ఏక్తకాలనీకి వచ్చి తమ ఇండ్లను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణ చేయడం తప్పని సరి, కావున ఇండ్లు కోల్పోయిన వారి కోసం ఎక్కడైనా డబుల్ బెడ్రూంలు ఇప్పించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో శంకర్, నర్సింహ, మున్ని, శివయ్య, రవి ,సీత, లక్ష్మి, సోని ఉన్నారు.