మణికొండ, అక్టోబర్ 27: అన్నివర్గాలకు సముచితమైన స్థానం కల్పించడం ఒక్క టీఆర్ఎస్ సర్కారుకే సాధ్యమౌతుందని ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నార్సింగి మున్సిపాలిటీ 6వ వార్డులోని నల్లచెరువులో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన చేపపిల్లలను స్థానిక మున్సిపాలిటీ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్‌యాదవ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, శివారెడ్డి, ప్రవళికకిరణ్లతో కలిసి చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏండేండ్లలో టీఆర్ఎస్ సర్కారు పాలనలో అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ సముచితమైన స్థానాన్ని కల్పించి అన్ని కులాలకు ఆర్థిక వెసులుబాటును కల్పిస్తున్నారు.మత్స్యశాఖ ఆధ్వర్యంలో ముదిరాజు, గంగపుత్ర కులస్తులకు వందశాతం సబ్సిడీలతో చేపపిల్లలను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, వైస్ చైర్మన్ జి.వెంకటేశ్‌యాదవ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, జి.శివారెడ్డి, సునీత, కో-ఆప్షన్ సభ్యులు ప్రశాంత్‌యాదవ్, ఫారూఖ్, మండల నాయకులు నర్సింహ, రమేశ్, హరిశంకర్, ప్రియదర్శిని, వార్డు నాయకులు, ముదిరాజు, గంగపుత్ర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.