బండ్లగూడ,అక్టోబర్ 12: సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. ఉప్పర్‌పల్లిలోని పొంగి పొర్లుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు రోడ్లపై పొంగి పొర్లుతున్న డ్రైనేజీల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో ప్రజలు,వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ విషయమై గతంలో అనేక మార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ మాట్లాడుతూ డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమకు సమస్యను తెలిపితే పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ధర్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి పలుగు చెరువు మహేశ్, సయ్యద్ ముజమిల్ అహ్మద్, సామ ఇంద్రపాల్‌రెడ్డి, జాన్‌పాల్, రగడంపల్లి శ్రావణ్‌కుమార్, శ్రీవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.