బండ్లగూడ,ఆగస్టు 24: బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. మంగళవారం పీరం చెరువు గ్రామంలోని వెస్టర్న్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి కార్పొరేటర్లు, నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. కోటి 95 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. డివిజన్లలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాలు, బస్తీల్లో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను చేపడుతున్నామన్నారు. సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, డీఈ శారద, ఏఈ రాజీవ్‌రెడ్డి, బండ్లగూడ జాగీర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్ గౌడ్, నాయకులు రావులకోళ్ల నాగరాజు, పాపయ్య యాదవ్, సుమన్ గౌడ్ పాల్గొన్నారు.
శంషాబాద్, ఆగస్టు 24: అంకితభావంతో పనిచేసే వారికి అన్ని విధాల గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. మంగళవారం నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డు టీఆర్ఎస్ నూతన కమిటీ ప్రతినిధులకు నియామక పత్రాలు అందజేశారు. కమిటీ నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా రమాదేవి, మహేందర్‌రెడ్డి, అంజద్, నరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ గౌడ్, కార్యదర్శులుగా మహేశ్, శ్రీపాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా రుష్వేందర్ రెడ్డి, మతీన్, నర్సింగ్‌రావు, ఎక్బాల్, శివప్రసాద్, అభిషేక్ గౌడ్, ఆరీఫ్ అలీ, నరేశ్, నరేందర్ రెడ్డి నియమితులైనట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ గణేశ్‌గుప్తా, వేణుమాదవరెడ్డి, వీరేందర్‌రెడ్డి, అస్లాం పాల్గొన్నారు.
బండ్లగూడ, ఆగస్టు 24: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాధానగర్ ఫేజ్-2లో రోడ్లు, తాగునీటి పైప్‌లైన్ పనులను చేపట్టాలని స్థానికులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. త్వరలో ప్రతిపాదనలు పెడుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.