MLA Meghareddy| కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల అసంతృప్తి పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయగా.. సోనియా గాంధీ నాకు టికెట్ ఇచ్చి, డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకుని గెలిపించాలని రేవంత్ రెడ్డికి చెప్పింది. కానీ డబ్బులకు ఆశపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డి అతనికే టికెట్ ఇచ్చాడంటూ చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
అయితే ఈ పంచాయతీపై ఢిల్లీకి.. అటు నుంచి గాంధీభవన్‌కు చేరగా చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్‌మోహన్‌కు వివరణ కూడా ఇచ్చారు. తాజాగా వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణలో అన్ని అబద్ధాలే ఉన్నాయని మేఘారెడ్డి అన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణకు నేను సంతృప్తి చెందలేదు. చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే. క్రమశిక్షణ కమిటీ మళ్లీ పిలిస్తే నా వాదన వినిపిస్తానన్నారు.
నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుల అసంతృప్తి పర్వం
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు
సోనియా గాంధీ నాకు టికెట్… pic.twitter.com/gK6gWOtV2v
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2026