మేడ్చల్, మార్చి 21: గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన యంగ్ డిప్లమాటిక్ క్లబ్‌ను ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి డిప్లమాటిక్ క్లబ్ సౌత్ సదన్ గౌరవ చైర్మన్‌తో గురువారం కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత శక్తి అపారమైనదని, దాన్ని సరియైన మార్గంలో వినియోగిస్తే సమాజంలో పెనుమార్పులు తీసుకురావచ్చన్నారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని, సమాజ హితం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి, ప్రెసిడెంట్ భద్రారెడ్డి, కార్యదర్శి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.