ఆక్రమిస్తుంటే ఏం చేస్తున్నారు?
ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్‌లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రెవెన్యూ, బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సారథినగర్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
- అధికారులపై ఎమ్మెల్యే మాగంటి ఆగ్రహం
- సారథినగర్‌లో ప్రభుత్వ స్థలాల పరిశీలన
ఎర్రగడ్డ, జూలై 20: ఎర్రగడ్డ డివిజన్ సారథినగర్‌లోని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన రెవెన్యూ, బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సారథినగర్ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. రహదారి కోసం వదిలిన సుమారు రూ.కోటి విలువ చేసే స్థలాన్ని ప్లాట్ నం.30కి చెందిన వాళ్లు దర్జాగా కబ్జా చేసి.. ప్రహరీ నిర్మించుకుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు. కండ్ల ముందే కబ్జా జరుగుతున్నా.. చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. సర్కారు స్థలాల పరిరక్షణ ధ్యేయంగా గతంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు ఏమయ్యాయని నిలదీశారు.
అధికారుల పని తీరు ఇంత దారుణంగా ఉంటే.. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కేటాయించిన స్థలాలు కూడా మాయమవ్వడం ఖాయమని గోపీనాథ్ అన్నారు. ప్లాట్నెం.30కి సంబంధించి స్థలం 214 చ.గజాలున్నట్లు ఆధారాలుండగా, 300 గజాల స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించిన వైనం ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నదన్నారు. రెవెన్యూ, బల్దియా టౌన్ ప్లానింగ్ విభాగాల మధ్య సమన్వయం లోపించిందనటానికి సారథినగర్ ప్రభుత్వ స్థలాల ఆక్రమణ ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. గత పదేండ్లుగా ఇక్కడి ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ఎన్నో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఐదారు నెలల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని ఊహించలేదన్నారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి ఆక్రమణకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవాలన్నారు. సర్కారు స్థలాల అన్యాక్రాంతమై జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

