జూబ్లీహిల్స్,సెప్టెంబర్8: పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడి విగ్రహాలను వినియోగించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. కరోనాను కట్టడి చేయడంతో పాటు కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బుధవారం యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణా నగర్ లేబర్ అడ్డా వద్ద మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితిని కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకోవడంతో పాటు కాలుష్యరహిత మట్టి ప్రతిమలతో సమాజానికి సందేశాన్నివ్వాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బండారి రాజ్ కుమార్ పటేల్ పాల్గొన్నారు.
బంజారాహిల్స్.సెప్టెంబర్ 8: పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. బుధవారం రహ్మత్‌నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని కార్పొరేటర్ సీఎన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. కాలుష్య కారకమైన రంగులను వాడి తయారు చేసే గణపతి ప్రతిమలకు వాడటంతో అనేక ఇబ్బందులు వస్తాయని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని కోరారు.
వెంగళరావునగర్, సెప్టెంబర్: మట్టి గణపతులనే వినియోగించాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. బుధవారం వెంగళరావునగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద సాయిబాబా ఆలయం సమీపంలో మట్టి గణపతి విగ్రహాలను కార్పొరేటర్ దేదీప్య విజయ్‌తో కలిసి పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన గణేశ్ విగ్రహాల కారణంగా వాతావరణం కలుషితమవుతుందన్నారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రమేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.