MLA KP Vivekananda | హైడ్రాకు అంత ప్రచార ఆర్భాటం ఎందుకు..? ఆ ఆఫీసర్‌ను రాజకీయాల్లోకి వెళ్లమనండి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
mla kp vivekananda | ఎక్కడో ఏ మూలనో పేద ప్రజలు గుడిసెలు వేసుకుని ఉంటే.. అవి కూలగొట్టి చుట్టుపక్కల ఉన్న ఓపెన్ ల్యాండ్ అంతా ఫెన్సింగ్ వేసి 1000 ఎకరాలు, 600 ఎకరాలు, 300 ఎకరాలు సేఫ్ చేసినా అని చెప్తే ఎవరిని తప్పుదోవ పట్టించేందుకు..? ఈ ప్రచార ఆర్భాటాలు ఎందుకు అని అడుగుతున్నానని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు .
MLA KP Vivekananda | హైడ్రా అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రెఫరెండమని ఓ టీవీ ఇంటర్య్వూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూర్చొని చెప్పడం చూసి షాకయ్యానని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రంగనాథ్ అసలు నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నవా.. రాజకీయం కోసం పనిచేస్తున్నవా..? అని ప్రశ్నించారు.
అసలు ఆ ఆఫీసర్‌కు రాజకీయంపై ఆసక్తి ఉంటే.. రాజకీయాల్లోకి వెళ్లమనండి.. రేపు అధికారంలో మీరుండొచ్చు.. నేనుండొచ్చు.. మీరుండకపోవచ్చు.. నేనుండకపోవచ్చు.. రేపు ఎవ్వరు వచ్చినా సరే గౌరవం అనేది ఉండాలి. మనం బాధ్యత గల వ్యక్తులం.. మనం ఇయ్యళ్ల ఉంటం.. రేపు పోతం.. కానీ అధికారి అనే వ్యక్తి 40-50 ఏళ్లు సర్వీసులో ఉంటడు.. బాధ్యతగా వ్యవహరించాలా.. వద్దా అని అడుగుతున్నానన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద.
ప్రభుత్వానివి ఓపెన్ ల్యాండ్స్ చాలా ఉంటయి.. ఎక్కడో ఏ మూలనో పేద ప్రజలు గుడిసెలు వేసుకుని ఉంటే.. అవి కూలగొట్టి చుట్టుపక్కల ఉన్న ఓపెన్ ల్యాండ్ అంతా ఫెన్సింగ్ వేసి 1000 ఎకరాలు, 600 ఎకరాలు, 300 ఎకరాలు సేఫ్ చేసినా అని చెప్తే ఎవరిని తప్పుదోవ పట్టించేందుకు..? ఈ ప్రచార ఆర్భాటాలు ఎందుకు అని అడుగుతున్నానని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు .
ప్రభుత్వ ఓపెన్ ల్యాండ్‌కు ఫెన్సింగ్ వేసి నేను ఈ భూమిని కాపాడిన అని వాళ్ల అఫీషియల్ హ్యాండిల్లో ఇన్ని వేల కోట్లు..ఇన్ని వందల ఎకరాలు నేను కాపాడిన అని చెప్తే.. మనం ప్రజలకు సేవకులం.. ఎవరిని మోసం చేయడానికి ఇదన్నారు.
హైడ్రాకు అంత ప్రచార ఆర్భాటం ఎందుకు?
ప్రభుత్వ భూమిలో ఒక మూలకు గుడిసెలు వేసుకున్న వారిని ఖాళీ చేయించి, ఆ భూమి అంతా మేమే కాపాడామని చెప్పడంతో ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు? – బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద pic.twitter.com/7WIJFKu7oO
— Telugu Scribe (@TeluguScribe) March 26, 2026
Read Also :
4 ఇన్క్లైన్లో హైమాస్ట్ లైట్లు బంద్ చేసే వారే లేరా?
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి : నల్లగొండ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

