గోల్నాక, ఫిబ్రవరి 11 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం అంబర్పేట మండల రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇ. విజయ్కుమార్గౌడ్. బి. పద్మావెంకట్రెడ్డి, వై. అమృత తదితరులతో కలసి 72 మంది షాదీముబారక్ లబ్ధిదారులకు మంజూరైన రూ.72 లక్షల8వేల 352 విలువగల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదింటి ఆడపడుచుల పెండ్లిళ్లకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా మారాడన్నారు. ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం షాదీముబారక్ కింద అందచేస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెవెన్యూ అధికారులు సాయిరాజ్, అశ్విన్, బీవీ. మహేశ్రాజు, బద్రినాథ్, రాము, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.