Jaspal Rana Mother భారత షూటింగ్ దిగ్గజం, దివంగత జస్పాల్ రాణా (Jaspal Rana) కుటుంబంలో మరో విషాదం నెలకొంది. జస్పాల్ మరణాన్ని తట్టుకోలేక అతడి తల్లి శ్యామా దేవి (Shyama Devi) కన్నుమూసింది. ఆయన చనిపోయిన మూడు వారాలకే ఆమె గుండె పోటుతో కాలం చేసింది. కొన్ని రోజులుగా వృద్దాప్య, ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న శ్యామ ఆదివారం మృతి చెందింది. సరిగ్గా జస్పాల్ 50వ జయంతి సందర్భంగా ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లడం వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
షూటింగే ప్రపంచంగా భారత్‌కు పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చిన జస్పాల్ రాణా జూన్ 12వ తేదీన మరణించాడు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆయన మృతి చెందడంతో.. తల్లి శ్యామా దేవి కుంగిపోయింది. కొన్నిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆమె జస్పాల్ 50వ వర్ధంతిన కన్నుమూసింది. ఈ విషయం తెలియగానే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జస్పాల్ కుటుంబానికి సంతాపం తెలిపారు.
Shyama Devi, mother of shooter Jaspal Rana, dies days after his death https://t.co/5QNt8rQKqT pic.twitter.com/fLLh1uptLV
— Deccan Herald (@DeccanHerald) June 29, 2026
‘పద్మశ్రీ అవార్డు గ్రహీత, దివంగత జస్పాల్ రాణా తల్లి శ్యామా దేవి కన్నుమూసిందనే విషాదకరమన వార్త విన్నాను. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆమె ఆత్మకు శాంతి చేకూరుగాక. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా’ అని సీఎం ధామి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. నెలలోపే కుమారుడు, భార్య చనిపోవడంతో రాణా తండ్రి నారాయణ సింగ్ రాణా గుండెపగిలేలా రోదిస్తున్నాడు.
श्री नारायण सिंह राणा जी की धर्मपत्नी एवं प्रसिद्ध भारतीय निशानेबाज, पद्मश्री स्व. जसपाल राणा जी की पूज्य माताजी के निधन का अत्यंत दुःखद समाचार प्राप्त हुआ।
इस कठिन घड़ी में मेरी गहरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान प्रदान करें… pic.twitter.com/KISVtyLqJL
— Pushkar Singh Dhami (@pushkardhami) June 28, 2026