Ketan Agarwal | కేతన్ అగర్వాల్ హత్య కేసు.. వరుడి నుంచి రూ.కోటి తీసుకుని ప్రియుడికిచ్చిన సియా..!
Ketan Agarwal | పుణె రియల్ ఎస్టేట్ వ్యాపారి (Pune Realter) కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. పెళ్లి షాపింగ్ పేరుతో వరుడి నుంచి రూ.కోటి తీసుకున్న నిందితురాలు సియా గోయల్ (Sia Goyel).. ఆ డబ్బును తన ప్రియుడు చేతన్ చౌదరి (Chetan Chaudhury) కి ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Ketan Agarwal : పుణె రియల్ ఎస్టేట్ వ్యాపారి (Pune Realter) కేతన్ అగర్వాల్ (Ketan Agarwal) హత్య కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. పెళ్లి షాపింగ్ పేరుతో వరుడి నుంచి రూ.కోటి తీసుకున్న నిందితురాలు సియా గోయల్ (Sia Goyel).. ఆ డబ్బును తన ప్రియుడు చేతన్ చౌదరి (Chetan Chaudhury) కి ఇచ్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హత్య తర్వాత ఇద్దరూ మూడేళ్లకు పెళ్లి చేసుకోవాలని కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
చేతన్ వ్యాపారం, కెరీర్‌ను నిలబెట్టేందుకు ఆ డబ్బును ఉపయోగించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాను ఆర్థికంగా బలపడేందుకు కనీసం మూడేళ్లు పడుతుందని సియాకు చేతన్ చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే కేతన్ హత్య తర్వాత సియా మూడేళ్లపాటు పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా సద్దుమణిగిన తర్వాతే వివాహం చేసుకోవాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
జూన్ 18న లోహగఢ్ కోట వద్ద జరిగిన హత్యకు ముందే ఇద్దరూ పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. సియా నీళ్లు తాగుతున్నట్లు లేదా షూ లేస్ కట్టుకుంటున్నట్లు కూర్చోవడం సంకేతంగా నిర్ణయించారు. ఆ సంకేతం కనిపించగానే చేతన్ వెనుక నుంచి వచ్చి కేతన్‌ను లోయలోకి తోసేయాలని ప్లాన్ చేశారు. కేతన్ కిందపడే సమయంలో సియాను పట్టుకునే అవకాశం లేకుండా ఉండేందుకే ఇలా ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
హత్యకు కేవలం 34 నిమిషాల ముందు సియా తన ప్రియుడు చేతన్‌తో రహస్యంగా మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డుల్లో గుర్తించారు. అదే హత్యకు తుది సంకేతమని పోలీసులు భావిస్తున్నారు. టోల్‌ప్లాజాల్లో గుర్తించకుండా ఉండేందుకు చేతన్ కారుకు బదులుగా స్కూటర్‌పై పుణె నుంచి లోహగఢ్ కోటకు వెళ్లినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

