Vishal | తెలుగు, తమిళ ప్రేక్షకుల పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ విశాల్. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘మకుటం’. దుషార విజయన్, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. తంబి రామయ్య, ఐర్జె తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్లో మండుతున్న శవంలో నుంచి సిగరెట్ వెలిగించుకుంటూ హీరో ఎంట్రీ ఇచ్చే సీన్‌తోపాటు అంజలి మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తుంది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్‌లో విశ్వరూపం చూపించాడు విశాల్.
మకుటం చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మేకర్స్ తాజాగా ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్ విడుదల చేశారు . సాంగ్ లాంచ్ ఈవెంట్లో విశాల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మకుటం సినిమాతో తెలుగు ఆడియెన్స్‌ను పలుకరించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు విశాల్. ఈ సారి కేవలం యాక్టర్‌గా మాత్రమే కాదు.. డైరెక్టర్‌గా కూడా మీ ముందుకు రాబోతున్నట్టు చెప్పాడు. శివ మూవీ చూసిన తర్వాత డైరెక్టర్‌గా మారాలని ఫిక్సయ్యా. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. ఈ రోజు ఆర్బీ చౌదరిని మిస్ అవుతున్నా. 99వ ప్రాజెక్ట్ బాధ్యతలను ఆయన నాకు ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ చిత్రానికి డైరెక్టర్‌గా మారానన్నాడు విశాల్.
ఆర్బీ చౌదరి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానే అనుకుంటున్నా. ఈ సినిమా కోసం నా వ్యక్తిగత విషయాలను ఏడాదికాలంగా పక్కన పెట్టేశాను. ఈ ప్రయాణంలో సాయిధన్సిక నాకు అండగా నిలిచారని చెప్పుకొచ్చాడు విశాల్. ఇప్పటికే విడుదల చేసిన లింగా పాట సూపర్ హిట్టయింది.. రెండో సింగిల్ ‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్‌ను ప్రభ అద్భుతంగా పాడిందన్నాడు. మకుటం ఇంత మంచి పాటను పాడే అవకాశం ఇచ్చిన విశాల్, జీవీ ప్రకాశ్ కుమార్‌కు సింగర్ ప్రభ ధన్యవాదాలు తెలియజేసింది. ప్రైవేట్ ఆల్బమ్స్ కు పాటలు పాడే తాను తొలిసారి సినిమాకు పాడటం ఆనందంగా ఉందంది.
Hero #Vishal Speech @ #Makutam Second Single Launch
🎵 #NachindhiMachane (Tamil):
https://t.co/A0iwX0jsCB🎵 #NachaakeVachera (Telugu):
https://t.co/FBoOatA2ka#SGF99 #Vishal35 #DirectorVishal #Magudam
A @gvprakash Musical! 🎼@VishalKOfficial @MagudamOfficial… pic.twitter.com/Iny37FbxRn
— BA Raju’s Team (@baraju_SuperHit) June 28, 2026
‘నచ్చాకే వచ్చేరా’ సాంగ్..