Ee Nagaraniki Emaindi 2 | ‘ఈ నగరానికి ఏమైంది’ మళ్లీ వస్తోంది.. సీక్వెల్‌కి రిలీజ్ డేట్ ఫిక్స్
Ee Nagaraniki Emaindi 2 | యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమా మొదట థియేటర్లలో సాధారణ విజయాన్ని అందుకున్నప్పటికీ, తర్వాత ఓటీటీ మరియు టెలివిజన్ వేదికల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించింది.
Ee Nagaraniki Emaindi 2 | యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన కల్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఈ నగరానికి ఏమైంది’ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమా మొదట థియేటర్లలో సాధారణ విజయాన్ని అందుకున్నప్పటికీ, తర్వాత ఓటీటీ మరియు టెలివిజన్ వేదికల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా యువతలో ఈ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.ఇప్పుడు ఆ కల్ట్ క్లాసిక్‌కు సీక్వెల్‌గా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం చిత్ర బృందం అధికారికంగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.
ఈ చిత్రాన్ని నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.మొదటి భాగంలో నలుగురు స్నేహితుల మధ్య జరిగే సరదా ప్రయాణం, వారి జీవితాల్లోని ఎమోషన్స్, ఫన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సీక్వెల్లో కూడా అదే ఫ్రెండ్షిప్ బాండింగ్‌ను మరింత కొత్త కోణంలో చూపించబోతున్నట్లు సమాచారం.ఈసారి కథ ఎలాంటి నేపథ్యంతో సాగనుంది? పాత పాత్రలు మళ్లీ కనిపిస్తాయా? కొత్త పాత్రలు ఎవరెవరు? అనే అంశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
మొదటి భాగంలో నటించిన విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను తమ అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వారి కామెడీ టైమింగ్, స్నేహితుల మధ్య సంభాషణలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.సీక్వెల్లో కూడా ఈ ప్రధాన నటీనటులు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన వీడియోలో నలుగురు హీరోలు విశ్వక్ సేన్, సాయినాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ఓ కార్ లో ముస్తఫా.. సాంగ్ పెట్టుకొని వెళ్తున్నట్టు కనిపించింది. ఈ సారి గోవా నుంచి థాయిలాండ్ కి వెళ్లే ట్రిప్ తో కథ ఉంటుందని అర్ధమవుతుంది. “గ్యాంగ్ ఈజ్ బ్యాక్” అనే భావనను కలిగించేలా రూపొందించిన ఈ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
The gang is back to celebrate where it all began ❤️
Celebrating the anniversary of #EeNagaranikiEmaindi with a release date announcement of ENE Repeat💥💥#ENERepeat in cinemas from NOVEMBER 19th, 2026 ✌🏻#8YearsOfENE #ENERepeatOnNov19th#TharunBhascker @VishwakSenActor… pic.twitter.com/Lkwz2VyWho
— S Originals (@SOriginals1) June 29, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

