Harish rao | నువ్వు హార్వర్డ్ వెళ్లినా.. అంతరిక్షం వెళ్లినా నీ చెత్త బుద్ధి మారదు.. సీఎం రేవంత్ కామెంట్స్‌పై హరీష్ రావు
Harish rao | హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారు. కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని మండిపడ్డారు.
Harish rao | హైదరాబాద్‌లో జరిగిన రావి నారాయణ రెడ్డి జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి హేట్ స్పీచ్‌పై హిత బోధ చేసిన కొద్ది నిమిషాలు కూడా గడవకముందే, అదే వేదికపై రేవంత్ రెడ్డి తన అసలు స్వభావాన్ని, తన మాటల ద్వారానే బయటపెట్టుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ధ్వజమెత్తారు. హేట్ స్పీచ్‌పై ఉపన్యాసం ముగియకముందే, రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్‌కు లైవ్ డెమో ఇచ్చారు. కేసీఆర్‌పై కడుపులో కత్తులు, నోటిలో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి తన అజీర్తిని, అక్కసును మరోసారి బయటపెట్టారని మండిపడ్డారు.
హేట్ స్పీచ్ అంటే ఏమిటో చెప్పడానికి పుస్తకాలు అవసరం లేదు.. రేవంత్ రెడ్డి ప్రసంగాలు చాలు. అమెరికా వెళ్లి హార్వర్డ్ లో నాలుగు రోజులు చదువుకున్నా.. రేవంత్ రెడ్డి తన వెనకటి గుణం మాత్రం మార్చుకోలేదు. కనీస సంస్కారం రాలేదు. చిల్లర మాటల్లో, వెకిలి చేతల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు హరీష్ రావు. ద్వేష రాజకీయాలకు, నరం లేని నాలుకతో విషం చిమ్మే కుసంస్కారానికి నిలువెత్తు నిదర్శనం రేవంత్ రెడ్డి.దేశానికి గాంధీ జాతిపిత అయినట్లే, తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతి పితనే. రేవంత్ రెడ్డినాలుగు కోట్ల ప్రజలు ఏకమై స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఆంధ్రా పాలకుల బూట్లు తుడుస్తున్న నీకు కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి ఎలా తెలుస్తుందన్నారు.
ఉద్యమకారులపైకి తుపాకి ఎక్కుపెట్టిన నీకు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కు ఉందా రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే, నిలదీస్తే అరెస్టులు, కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న నీకు ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే హక్కు ఉందా.. రేవంత్ రెడ్డి ? అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా, ప్రతిపక్షాలపై రాజకీయ కక్షల కోసం వినియోగిస్తున్న నీకు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడే హక్కు ఉందా.. రేవంత్ రెడ్డి ? లక్కీ లాటరీలో ముఖ్యమంత్రి అయిన నీకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి..? ఎలా అర్థం అవుతాయి రేవంత్ రెడ్డి..? నువ్వు అమెరికాలోని హార్వర్డ్ వెళ్లినా, అంతరిక్షం వెళ్లినా నీ చెత్త బుద్ధి మారదు, నోటి మురికి పోదు అన్నది సుస్పష్టమైందని హరీష్ రావు ఎద్దేవా చేశారు.
Read Also :
Chandrababu | తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షిస్తాం : చంద్రబాబు
Supreme Court | పాకిస్తాన్ నుంచి వచ్చిన దళితులకు ఇండ్లు ఇవ్వాల్సిందే.. సుప్రీం కోర్టు ఆదేశం
KTR | మీరు దర్యాప్తు బృందానికి చీఫ్ అనే సంగతి గుర్తుచేసుకోండి.. సిట్ చీఫ్ సజ్జనార్‌కు కేటీఆర్ హితవు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

